సచివాలయాన్ని తనిఖీ చేసిన MRO

VZM: రేగిడి ఆమదాలవలస MRO కృష్ణలత గురువారం స్దానిక బూరాడ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, పలు రికార్డులు పరిశీలించారు. రెవెన్యూ సేవలపై ఆరా తీశారు. సచివాలయంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.