VIDEO: పుస్తకాలు పట్టాల్సిన వారితో గడ్డి పీకిస్తున్నారు
MHBD: తొర్రూర్ జెడ్పీ హైస్కూల్‌లో నేడు జరిగే ఓ ప్రవేట్ కార్యక్రమం కోసం శుక్రవారం విద్యార్థులతో పీఈటీ గడ్డి పీకించాడు. ఓ ప్రవేట్ కార్యక్రమం కోసం విద్యార్థులతో పని చేయించిన పిఈటీపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఈటీ చర్యపై స్థానికులు విచారణ కోరుతున్నారు. పాఠశాలలో విద్యార్థులతో బలవంతపు పనులు చెపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.