మందమర్రి ఏరియా GMను కలిసిన నూతన ACP
MNCL: బెల్లంపల్లి నూతన ACPగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ మందమర్రి ఏరియా GM రాధాకృష్ణను కలిశారు. సింగరేణి సంస్థ కార్యకలాపాలు, ఏరియాలో శాంతిభద్రతల పరిరక్షణపై చర్చించారు. సంస్థ భద్రత, స్థానిక సమస్యల పరిష్కారంలో పోలీస్ యంత్రాంగం అందిస్తున్న సహకారానికి GM ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధమైన సమన్వయం కొనసాగాలని కోరారు.