పెద్దజట్రంలో NCD హెల్త్ క్యాంప్

పెద్దజట్రంలో NCD హెల్త్ క్యాంప్

NRPT: ఊట్కూరు మండలంలోని పెద్దజట్రం గ్రామంలో సోమవారం ఎన్సీడీ (NCD) హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాకిటి వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీపీ, షుగర్, టీబీ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్, ఎంపీహెచ్ గోవింద్ రాజ్, సెక్రెటరీ బబిత, ఏఎన్ఎం అనిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.