శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి
HYD: రాజేంద్రనగర్ నియోజకవర్గం కోకాపేట్‌లోని శ్రీశారదా పీఠాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న రాజేష్ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి పీఠం కార్యకలాపాలు, తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.