త్వరలో మరో డీఎస్సీ: సీఎం చంద్రబాబు
పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు, త్వరలో మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు, ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. తాము చేపట్టిన మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ నెల 10 నుంచి టెట్ నిర్వహించబోతున్నామని, దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు.