'పార్కులో సెంట్రల్ లైటింగ్ పెట్టించండి'
RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సచివాలయ నగర్ సీనియర్ సిటిజన్ భవనానికి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి సొంత నిధులతో రంగులు వేయించారు. గౌతమ్ బుద్ధ పార్క్‌లో సెంట్రల్ లైటింగ్ పెట్టించాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కార్పొరేటర్‌ను కోరారు. స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.