పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
JN: పెద్దమడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన సరకుల నిల్వలు, అకౌంట్ రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.