అధికారులపై ఎమ్మెల్యే సింధూర రెడ్డి ఆగ్రహం
సత్యసాయి: ఓడిచెరువు మండలం కొత్తపల్లి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి స్పందించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఘటనపై విచారణకు ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.