ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి మంత్రి కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందజేసినట్లు తెలిపారు. సమస్యలు సావధానంగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.