SVU డిగ్రీ పరీక్షలు వాయిదా

SVU డిగ్రీ పరీక్షలు వాయిదా

TPT: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. రాజమాణిక్యం తెలిపారు. ఈ నెల 30న జరగాల్సిన పరీక్షను మే 15కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 పరీక్ష కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.