భవన నిర్మాణ కార్మిక సంఘ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

GNTR: భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (CITU) 8వ రాష్ట్ర మహాసభలు ఈనెల 23, 24 తేదీల్లో పాతగుంటూరులో జరగనున్నాయి. మంగళవారం బ్రాడీపేట సీఐటీయూ నగర కార్యాలయంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. రాజధాని నిర్మాణంలో భవన నిర్మాణ కార్మికులను భాగస్వామ్యం చేయాలని సంఘ నాయకుడు దండా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.