భవానీ భక్తులపై పోలీసుల దాడి
AP: విజయవాడలో దారుణం జరిగింది. భవానీ భక్తులపై పోలీసులు చేయిచేసుకున్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దాడి చేశారని భవాని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కంకిపాడు నుంచి ఆటోలో దుర్గమ్మ దర్శనానికి భక్తులు వస్తుండగా.. బెంజ్ సర్కిల్, రామ లింగేశ్వర కట్టవద్ద అడ్డుకున్న పోలీసులు దాడి చేశారని భవానీలు ఆరోపిస్తున్నారు.