ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని వినతి

సత్యసాయి: పెనుకొండ మండలంలో ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డాక్టర్ రిహానాకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ మండల కన్వీనర్ బాబావలి, ఆశా వర్కర్స్ యూనియన్ రాజేశ్వరి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.