మాచవరం గ్రామానికి LED బల్బులు అందజేత

మాచవరం గ్రామానికి LED బల్బులు అందజేత

SRPT: మాచవరం గ్రామంలో వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను గమనించిన గ్రామ యువకుడు యరగాని నాగరాజు గ్రామ పంచాయతీకి సుమారు 130 LED బల్బులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్, దేశ్‌ముఖ్, యరగాని భిక్షం, గడ్డం నాగయ్య, యరగాని గురవయ్య, తదితరులు పాల్గొన్నారు. ఊరుకోసం చేసిన మంచి కార్యక్రమాన్ని గ్రామస్తులు ప్రశంసించారు.