101 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలామ్ స్వాధీనం

101 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలామ్ స్వాధీనం

కామారెడ్డి: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 101 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలామ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు పులి రమేశ్ పరారీలో ఉన్నాడన్నారు. మధ్యవర్తి అనిల్ కుమార్ శాంపిల్ చూపించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డాడన్నారు. సీఐ రాజారెడ్డి బృందం 24 గంటల్లో ఈ కేసును ఛేదించి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.