మంత్రాల పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్

మంత్రాల పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్

సిద్దిపేటలో మంత్రాలతో జబ్బులు నయం చేస్తానని అమాయకులను మోసం చేస్తున్న రహీముద్దీన్‌ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్‌నగర్‌‌కు చెందిన చాట్లపల్లి రాజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండగా, రహీముద్దీన్ తన వద్ద అతీత శక్తులున్నాయని నమ్మించి రూ. 45,000 వసూలు చేశాడు. మంత్రాలతో చంపుతానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.