మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SRD : పర్యావరణ హితమైన మట్టి వినాయకులను పూజించడం వల్ల చెరువులు కాలుష్యం నుంచి కాపాడుతాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పటాన్ చెరు గాంధీ పార్క్ సమీపంలో GHMC ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు స్వయంగా ప్రతిమలు అందజేశారు.