ఆదోని జిల్లా సాధన కోసం బంద్‌కు పిలుపు
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం ఈ నెల 10న ఆదోని నియోజకవర్గంలో బంద్‌కు జిల్లా సాధన సమితి JAC నాయకులు తీర్మానించారు. ఆదివారం ద్వారకా ఫంక్షన్ హాల్లో JAC ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదోని జిల్లా సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. డివిజన్లోని 7 నియోజకవర్గాల్లో జిల్లా సాధన కోసం నడుం బిగించాలన్నారు.