ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ
MNCL: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో భారీ ర్యాలీ చేపట్టారు. తిలక్ స్టేడియం నుంచి ప్రధాన రహదారుల గుండా కాంట చౌరస్తా వరకు కొనసాగింది. సామ్రాజ్యవాద అమెరికా మధ్య ఆసియా స్వాతంత్య్ర దేశాలపై దాడులు చేస్తూ, ఆయా దేశాల్లోని చమరు నిక్షేపాలపై తన పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.