విద్యుత్ కోత.. రైతన్న గోస..!
VKB: ధారూర్ మండలంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నాగసమందర్ సబ్స్టేషన్ పరిధిలోని బోరు బావులకు సరైన విద్యుత్ అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లో-వోల్టేజీ సమస్య కారణంగా బోర్ మోటార్లు తరచూ రిపేరుకు వస్తున్నాయని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.