వివాహంలో కట్నకానుకల నిషేధం

వివాహంలో కట్నకానుకల నిషేధం

ADB: ఆదిలాబాద్ మండలం చీచ్‌దరి గ్రామం ఆదర్శ వివాహానికి వేదికైంది. పూసనక రూపాబాయి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం వధువుకు రూ.18,000 ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ తోడసం లింగు, సర్పంచ్ కేశవ్ తదితరులు పాల్గొని నవవధువును ఆశీర్వదించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.