'విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ముఖ్యం'

KNR: విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, వారిని వివిధ స్థాయిల్లో పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించడం చాలా ముఖ్యమని అల్‌ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని కొత్తపల్లిలోని అల్‌ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో కొత్తపల్లి మండల ఎస్సీఎఫ్ కార్యదర్శి గన్నె లక్ష్మణు తన సొంత నిధులతో క్రీడాకారులకు టీ షర్ట్స్ అందజేశారు.