భీమవరంలో మహిళా చట్టాలపై అవగాహన

భీమవరంలో మహిళా చట్టాలపై అవగాహన

W.G: భీమవరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అహ్మదునిషా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రూపొందించిన 'శక్తి యాప్' మహిళలకు అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుందని, ప్రతి విద్యార్థిని తమ స్మార్ట్ ఫోన్లలో దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఈ యాప్ ఎంతో తోడ్పడుతుందని వివరించారు.