బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
HNK: మొంథా తుఫాన్ ప్రభావంతో ఇళ్లూ, జీవనోపాధి దెబ్బతిన్న నిరుపేద కుటుంబాలకు వర్దన్నపేట MLA కేఆర్ నాగరాజు శుక్రవారం రేషన్ బియ్యం పంపిణీచేశారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ పరిధిలోని గోపాలపురంలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో 272 నిరుపేద కుటుంబాలకు MLA ఈరోజు బియ్యం పంపిణీ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.