కేజీబీవీ దరఖాస్తుకు గడువు పెంపు
ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తుకు ఈ నెల 10 వరకు గడువు పొడిగించినట్లు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ) టి.శైలజ తెలిపారు. 6,11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.