బీచ్ ఫెస్టివల్ కోసం 10 RTC బస్సులు: డిపో మేనేజర్
NLR: సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరంలో 14, 15 తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ కోసం కందుకూరు RTC డిపో నుంచి 10 బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. అందుకోసం ఆదివారం 10 బస్సులు కందుకూరు-పాకల మధ్య సేవలందిస్తాయని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.