VIDEO: వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
WNP: గోశాలలో మంగళవారం 23వ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పచ్చటి తోరణాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, అన్నమయ్య సంకీర్తనల మధ్య సాగిన స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు భారీగా షామియానాలతో ఏర్పాటు చేశారు.