విద్యార్థుల జయహో పత్రిక.. అభినందించిన CI
SKLM: పత్రికలు సమాజానికి ప్రతిబింబాలని నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు అన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు రూపొందించిన పత్రికను బుధవారం ఆవిష్కరించారు. సీఐ మాట్లాడుతూ.. పత్రికలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో CI తోపాటు డైరెక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.