ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయసు పెంచాలని వినతి
HYD: TGPSC ద్వారా జరిగే రిక్రూట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయస్సు 46కు పెంచాలని నిరుద్యోగ హక్కుల పోరాట సంఘం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించారు. తాజాగా విడుదలైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్లో 34 ఏళ్ల వరకు మాత్రమే అర్హతగా పేర్కొన్నారని, దీని ద్వారా అనేకమంది నష్టపోతారన్నారు.