గూగుల్‌పై జరిమానా.. EUపై ట్రంప్ ఫైర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గూగుల్‌పై యూరోపియన్ యూనియన్ విధించిన జరిమానాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జరిమానా అన్యాయం, వివక్షతో కూడిన చర్య అని ఆయన అభివర్ణించారు. గూగుల్ చెల్లించాల్సిన ఈ డబ్బు అమెరికాలో పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు వెళ్లాల్సిందని ట్రంప్ అన్నారు. ఈ జరిమానాను రద్దు చేయాలని యూరోపియన్ యూనియన్‌ను ట్రంప్ బెదిరించినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.