VIDEO: కాలువలో జారిపడ్డ ఎంపీడీవో

MLG: మంగపేట ఎంపీడీవో బద్రి నాయక్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కమలాపురం లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం భగత్ సింగ్ కాలనీలో చేరిన వరద నీటిని పరిశీలించేందుకు వెళ్తున్న ఎంపీడీవో ఒక్కసారిగా సైడు కాలువలో జారి పడ్డారు. గమనించిన తోటి అధికారులు వెంటనే ఎంపీడీవోను పైకి లేపారు.