అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్న అధికారులు
MHBD: తొర్రూరు మండలంలో రెండవ విడతలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు నేడు (శనివారం) ప్రకటించనున్నారు. ఇదే రోజు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు సైతం కేటాయించనున్నారు. కాగా మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలకు గాను 292 సర్పంచ్, 276 వార్డు స్థానాలకు 772 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 14న స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి.