'వినూత్న బోధన పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది'

NGKL: వినూత్న బోధన పద్ధతులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం బలమూరు మండలం నాగిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి బోధనాభ్యాస సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా విషయాలపై విద్యార్థులకు ఆసక్తి కలిగించాలన్నారు.