రేపు జాతీయ లోక్ అదాలత్
WG: ఈనెల 13వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి అన్నారు. నిన్న జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13,800 కేసులను రాజీయోగ్యమైనగా గుర్తించామన్నారు.