ఫైట్ మాస్టర్‌గా రాణిస్తున్న చొప్పెల్ల వాసి

ఫైట్ మాస్టర్‌గా రాణిస్తున్న చొప్పెల్ల వాసి

కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన సుంకర రాంబాబు (రామ్ సుంకర) సినిమాల్లో ఫైట్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. చిన్నప్పుడు చదువు రాకపోయినా కానీ, డిష్యూం..డిష్యూం.. అంటూ కరాటే, కుంగ్ ఫూ మీద ఆసక్తి చూపేవారు. సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లి తన ప్రతిభ నిరూపించుకున్నారు. అగ్ర సినీ ప్రముఖుల సినిమాల్లో స్టంట్ మెన్‌గా 457 సినిమాలకు పనిచేశారు.