విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

SRPT: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మొలుగూరి నరసింహారావు (38) తమ వ్యవసాయ క్షేత్రంలో బోరు పంపు స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. నరసింహారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.