'గిరిజనులు తప్పనిసరిగా దోమతెరలు వినియోగించాలి'

'గిరిజనులు తప్పనిసరిగా దోమతెరలు వినియోగించాలి'

AKP: గిరిజనులు తప్పనిసరిగా దోమ తెరలను వినియోగించాలని గొలుగొండ మండలం పాతమల్లంపేట సర్పంచ్ మామిడి ఆదిలక్ష్మి అన్నారు. శుక్రవారం పంచాయతీలో దోమ తెరలను పంపిణీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగానే దోమ తెరలను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.