గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీలక్ష్మీ అమ్మవారు
PLD: సత్తెనపల్లిలోని వెంకటపతి కాలనీలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ ప్రత్యంగిరా అమ్మవారి పీఠంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు మంగళవారం ఆశ్వీయుజ శుద్ధ విదియనాడు గాయత్రీ దేవిగా శ్రీ నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రులను పురస్కరించుకొని భక్తులు విరివిగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.