గంగకత్వ కాల్వ ఆధునీకరణకు 37 కోట్లు: మంత్రి
SRD: సదాశివపేటలోని గంగకత్వ కాల్వ 15 మీటర్ల ఆధునికరణ కోసం 37 కోట్ల రూపాయల మంజూరైనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి హైదరాబాద్లోని కార్యాలయంలో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాల్వ ఆధునీకరణ కోసం మూడు రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.