భయపెడుతున్న వర్ష సూచన
TPT: గూడూరు నియోజకవర్గ పరిధిలో పది రోజుల్లో వరి కోత పనులు ప్రారంభం కానున్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 18, 19న ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో సుమారు 40 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. త్వరలో వరి కోత ఉండగా వర్ష సూచన వార్తతో రైతన్నలో కలవరం మొదలైంది.