కారు ఢీకొని యువకుడు మృతి

కారు ఢీకొని యువకుడు మృతి

GNTR: కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మేడికొండూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంగళాయపాలెంకి చెందిన వాసు ఫిరంగిపురం నుంచి గుంటూరుకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.