కొవ్వూరులో డ్రగ్స్ ముఠా అరెస్ట్
E.G: కొవ్వూరులో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. బెంగళూరు నుంచి రాజమండ్రికి మోత్ డ్రగ్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. DSP దేవకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుల వద్ద సుమారు 18.15 గ్రాముల మోత్ను స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి పరిసర గ్రామాల కాలేజీ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది