బెట్టింగ్ ప్రమోషన్లు.. సీపీ హెచ్చరిక..!
HYD: బెట్టంగ్ మోసాలపట్ల CP సజ్జనార్ హెచ్చరించారు. IPL క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు, మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని ముందే చెబుతాం అంటూ పెయిడ్ ప్రమోషన్లు చేస్తున్నారు. నెల రోజుల్లోనే అలాంటి 129 ప్రొఫైళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా మోసపోతే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు.