రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

SRD: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్‌ను పదవ తరగతి పూర్వ విద్యార్థులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ.. తనను చిన్ననాటి మిత్రులు సన్మానించడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనాథ్ కులకర్ణి, వ్యాపారవేత్త శశి కిరణ్, పాల్గొన్నారు.