'ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పల్స్ పోలియో నివారణ'

NLG: పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పల్స్ పోలియో చుక్కల నివారణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.