స్పిరిట్ డిగ్రీ కళాశాల విద్యార్థి సస్పెండ్
కడపలో స్పిరిట్ డిగ్రీ కళాశాలలో శనివారం రికార్డులు సరిగా రాయలేదన్న కారణంతో విద్యార్థినిపై, విద్యార్థి దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జేపీ, ఏబీవీపీ నాయకులు విద్యార్థిపై కఠన చర్యలు తీసుకుని.. సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కళాశాల యాజమాన్యం విద్యార్థిని సస్పెండ్ చేసింది.