ప్రజలు అప్రమత్తతతో ఉండాలని సీఐ సూచన

ప్రజలు అప్రమత్తతతో ఉండాలని సీఐ సూచన

అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని ఎల్లమరాజు చెరువులో భారీ వర్షాల వల్ల నీటి మట్టం పెరిగి, అలుగు పారేందుకు సిద్ధంగా ఉంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్ బాబు ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. చెరువు సమీప ప్రాంతాలకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సీఐ సూచించారు.