వైద్య కళాశాల పనులను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పరిశీలించారు. పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో వైద్య కళాశాలలో తరగతులను ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో కృష్ణవేణి తహసిల్దార్ విశ్వప్రసాద్ తదితరులు ఉన్నారు.