దండోరా సదస్సును విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్

కామారెడ్డి: పట్టణంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగం భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 7న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో దండోరా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.